Adari Anand: విశాఖ డెయిరీ చైర్మన్ వైసీపీకి రాజీనామా..! 2 d ago
వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశాఖలో మరో షాక్ తగిలింది. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ వైసీపీకి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆనంద్ రాజీనామా చేశారు. ఆనంద్ తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేసారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసానని ఆనంద్ తెలిపారు. రాజీనామా లేఖను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.